
ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా చూడండి
కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: రాజీవ్ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రా జీవ్ యువ వికాసం పథకంపై అన్ని జిల్లాల కలెక్ట ర్లు,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 5వ తేదీ లోపు రాజీవ్ యువ వికాసం పథకానికి దర ఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మల్లేశం, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి, డీపీఓ జయసుధ, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా హనుమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.