
దుద్యాల్ మండలంలో ప్రారంభం కాని పథకం
దుద్యాల్: మండలంలో సన్నబియ్యం పథకం ప్రారంభానికి నోచుకోలేదు. మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వచ్చారు. షాపులకు తాళాలు ఉండటంతో చాలా సేపు ఎదురు చూశారు. ఎంత సేపటికీ డీలర్లు రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. రేషన్ షాపులకు స్టాక్ పాయింట్ నుంచి సన్నబియ్యం వచ్చినా ఎందుకు ఇవ్వలేదని కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు మానుకొని బియ్యం కోసం వస్తే షాపులు మాసి ఉంచడం సరికాదన్నారు.
u
u
ఎలాంటి సమాచారం లేదు
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చే యాలని మాకు ఎలాంటి సమాచారం లేదు. పై అధికారుల నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రజలు ఎలాంటి ఆపోహలకు గురికారాదు. రేషన్ షాపులకు సన్న బియ్యం చేరింది.ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం.
– కిషన్, తహసీల్దార్, దుద్యాల్

దుద్యాల్ మండలంలో ప్రారంభం కాని పథకం