
గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి
పరిగి: గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అన్నారు. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీపీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే అన్ని పార్టీల నాయకులు, ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రజలు కలసికట్టుగా చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి నెలలో నిర్వహించే గ్రామసభలో ప్రతి ఒక్కరూ పాల్గొలన్నారు. అనంతరం సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
సీఈఐఆర్ టెక్నాలజీతో
ఫోన్ల రికవరీ సులభం
ఎస్‌ఐ అన్వేష్ రెడ్డి
కుల్కచర్ల: సీఈఐఆర్ టెక్నాలజీతో చోరీ చేసిన, పోగొట్టుకున్న ఫోన్లను రీకవరీ చేయవచ్చని స్థానిక ఎస్‌ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు. జనవరి 14న గండీడు మండలం చిన్నవార్వాల గ్రామానికి చెందిన పోలెపల్లి గౌరయ్య వ్యక్తిగత పనులమీద కుల్కచర్లకు రాగా గుర్తుతెలియని వ్యక్తులు తన ఫోన్‌ను అపహరించారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఈఐఆర్ టెక్మాలజీ ద్వారా అట్టి ఫోన్‌ను గుర్తించి గురువారం బాధితుడికి అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్ పోగుట్టుకున్నట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సీఈఐఆర్ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ రఘు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తగిన గుణపాఠం చెప్పాలి
దుద్యాల్: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మండల పరిధిలోని హస్నాబాద్‌లో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిందువాహిని ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారితో పాటు ఇందుకు ప్రోత్సహించిన, సహకరించిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహేశ్వరం ఆర్టీసీ డిపోకు ‘హై లెవల్’ అవార్డు
మహేశ్వరం: ఆర్టీసీ డిపోలో బస్సులకు అత్యధిక కేపీఎల్ వచ్చినందుకు మహేశ్వరం డిపోకు హైలెవల్ మైలేజ్ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని అశోక్ లేలాండ్ వారు నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ సిటీ విభాగంలో ఆల్ బీఎస్–6 బస్సులకు అత్యధికంగా 5.77 కేపీఎల్ వచ్చినందుకు మహేశ్వరం డిపోకు హై మైలేజ్ అవార్డ్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా డిపో మేనేజర్ లక్ష్మీసుధ అందుకున్నా రు. ఈ సందర్భంగా లక్ష్మీసుధ మాట్లాడుతూ.. మహేశ్వరం డిపోలో డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది క్రమశిక్షణతో పని చేయడంతో ఈ అవార్డు దక్కిందన్నారు. అందరి కృషితో అవార్డు వచ్చిందని, ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు.
బాలికపై కుక్కల దాడి
షాద్‌నగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై గ్రామ సింహాలు దాడి చేశాయి. ఈ ఘటన పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న నాగరాజు కూతురు అవని(8), ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ అయిందని, మున్సిపల్ అధికారులు స్పదించి శునకాలను తరలించాలని కోరుతున్నారు.

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి