
నేడు ధారూరుకు స్పీకర్ ప్రసాద్‌కుమార్
ధారూరు: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించే భూ భారతి అవగాహన సదస్సుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరుకానున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. మండలంలోని రైతులు హాజరుకావాలని తహసీల్దార్ సాజిదాబేగం కోరారు.
శ్రీవారికి పూలంగి సేవ
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య పూలంగి సేవ నిర్వహించారు. మూలమూర్తిని అర్చకులు పలు రకాల పూలతో అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
అంగడి అగ్గువ
సంతల్లో భారీగా తగ్గిన కూరగాయల ధరలు
బొంరాస్‌పేట: కూరగాయలు, ఆకుకూరల ధరలు భారీగా తగ్గాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ.50 నుంచి రూ.100 వరకు ఉన్న ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. గత ఆదివారం బొంరాస్‌పేట, తుంకిమెట్ల సంతల్లో కిలో టమాటా రూ.20 ఉండగా ఈ వారం రూ.5 పలికింది. ఉల్లిగడ్డ రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.15, క్యారెట్, బీర, కాకర, వంకాయ తదితరల కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. గత వారం ఆలుగడ్డ, పచ్చిమిర్చి రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.40 తగ్గి రూ.60లకు విక్రయిస్తున్నారు. ఆకుకూరలు సైతం సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంగన్‌వాడీ కోడిగుడ్లు పక్కదారి
కుల్కచర్ల: అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా చేసిన కోడిగు డ్లు బహిరంగ మా ర్కెట్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఘటన మండలంలోని చౌ డాపూర్‌లో వెలుగుచూసింది. వివరా లు ఇలా ఉన్నాయి.. ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో తనిఖీలు చేశారు. అక్కడ అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన 23 కోడిగుడ్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మండల, ఐసీడీఎస్ అధికారులకు తెలియజేడం జరిగిందని రాజిరెడ్డిని తెలిపారు.
నేడు వాహనాల వేలం
మోమిన్‌పేట: నిషేధిత సరుకులు రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు సోమవారం వేలం నిర్వహించనున్నట్లు ఎకై ్సజ్ ఎస్‌ఐ సహదేవుడు తెలిపారు. మండల కేంద్రంలోని ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో ఉదయం 11గంటలకు వేలం ఉంటుందని తెలిపారు. రెండు కార్లు, ఒక చేతక్, రెండు ఆటోలు, ఒక బైక్, ఒక స్కూటీకి వేలం వేస్తామన్నారు. ఆసక్తి కలవారు వేలంలో పాల్గొనాలని సూచించారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
కుల్కచర్ల: చౌడాపూర్ మండలం చాకల్‌పల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మల్కమ్మ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. వివరాలు ఇలా ఉన్నా యి. ఆదివారం మల్కమ్మ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో సామగ్రి, వస్తువులు, ఆహార పదార్థాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్థులు మంటలను ఆర్పారు. ప్రభుత్వ ఆదుకోవాలని బాధిత మహిళ కోరింది.

నేడు ధారూరుకు స్పీకర్ ప్రసాద్‌కుమార్

నేడు ధారూరుకు స్పీకర్ ప్రసాద్‌కుమార్