కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
మర్రిపాలెం (విశాఖపట్నం): ఎన్‌ఆర్‌ఐ యువకుడికి వలపు వల వేసిన కి‘లేడి’పై ఐదో పట్టణ పోలీస్ స్టేషన్(కంచరపాలెం)లో మరో బాధితుడు ఫిర్యాదు చేశాడు. మురళీనగర్ ఎన్‌జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా షీలానగర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ యువకుడిని వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే.
ఆమె నుంచి తప్పించుకున్న ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో జెమీమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌ఆర్‌ఐ యువకుడి లాగే.. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆమె వలపు వలలో చిక్కుకున్నాడు. అతడితో పరిచయం పెంచుకున్న జెమీమా పలుమార్లు నగదు తీసుకుంది. మాయమాటలు చెప్పి వివాహం కూడా చేసుకుంది. ఆ తర్వాత ఆమె జాడ లేకపోవడంతో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న జెమీమా అతన్ని వేధింపులకు గురిచేస్తూ అందినకాడికి దోచుకుంది. నగదు ఇవ్వలేని పక్షంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను అతని భార్యకు చూపిస్తానని బెదిరించేది. దీంతో ఆమె అడిగినంత నగదును ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌ఐ యువకుడి ఘటన వెలుగులోకి రావడంతో బాధితుడు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించాడు. అతని నుంచి పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం: ఎన్‌ఆర్‌ఐకు వలపు వల..
హనీట్రాప్ కేసులో ఆధారాలు సేకరిస్తున్నాం
అల్లిపురం: హనీట్రాప్ కేసులో ఆధారాలు సేకరిస్తున్నామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన మాట్లాడారు. నిందితురాలు కోరుప్రోలు జాయ్ జెమీమా వెనుక ఒక ముఠా ఉందని, వారే ఆమెకు శిక్షణ ఇచ్చారన్నారు. ధనవంతులను ఎలా ట్రాప్ చేయాలి? మత్తు ఎలా ప్రయోగించాలి? వీడియోలు తీసి ఎలా బ్లాక్‌మెయిల్ చేయాలి? వంటి అంశాలపై తరీ్ఫదునిచ్చారన్నారు. జెమీమా బాధితులు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారన్నారు. ఆధారాలన్నీ సేకరిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కమిషనర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment