
‘ప్రతి ఇంటా శ్రీ మహాగణపతి లక్ష మోదక యజ్ఞం జరగాలి’
ఎంవీపీకాలనీ: శ్రీ మహా గణపతి వైభవంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. రుషిపీఠం సత్సంగం శాఖ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని భద్రం పార్క్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రవచిస్తూ.. లోక కల్యాణం కోసం ప్రతి ఇంటా శ్రీ మహాగణపతి లక్ష మోదక యజ్ఞం జరగాలన్నారు. ఆ యజ్ఞం విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం వివిధ గణపతులకు ప్రత్యేక పూజలు ఎలా చేయాలో వివరించడంతో పాటు వేద, పురాణ, మంత్ర శాస్త్రాల సహిత శ్రీ మహా గణపతి వైభవాన్ని తన ప్రవచనాల ద్వారా తెలియజేశారు. నిర్వాహకులు కె.వి.ఎస్ శ్యామ్, కందాళ అరుణ గాయత్రి, డి.శ్రీనివాస్, వి.వి.ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment