సీతంపేట: వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను బెదిరిస్తారా అని దళిత, ప్రజా, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. ఓ పత్రికా సంపాదకుడికి విశాఖ ఆర్డీవో శ్రీలేఖ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అని మండిపడ్డారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వాక్ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, న్యాయవాది కె.పద్మ, ప్రజా సంఘాల నాయకులు డెంకాడ ఆనంద్, రాజేంద్రప్రసాద్, కిశోర్, లలిత, జె.శ్యామల, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment