
ఘనంగా రాధాకృష్ణ మహోత్సవాలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులో జరుగుతున్న శ్రీరాధాకృష్ణ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం అధివాసాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ వైకుంఠం ప్రతినిధులు అంబరీష దాస, యదురాజ దాస మాట్లాడుతూ ప్రాణప్రతిష్ట అంటే దేవతా మూర్తి పవిత్ర స్వరూపంలో ప్రాణశక్తిని స్థాపించే ఆచారమన్నారు. ప్రతిష్ట అంటే పవిత్రం చేయడం, స్థాపన చేయడం, శాశ్వత స్థానంలో ఉంచడం అని వివరించారు. ఉత్సవాల్లో ముందుగా వేద పండితులు శాస్త్రాల ప్రకారం గోపూజ నిర్వహించారు. సాయంత్రం ధాన్యాధివాసం, జలాధివాసం, ఛాయాధివాసం, క్షీరాధివాసం వంటి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆంధ్ర, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, బెంగళూరు ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ కేశవ ప్రభు, విశాఖ శాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస, దాదాపు 400 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు.

ఘనంగా రాధాకృష్ణ మహోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment