
గాజువాక పీహెచ్‌సీని సందర్శించిన కేంద్ర బృందం
గాజువాక : మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగానికి చెందిన పాపులేషన్ రీసెర్చ్ కమిటీ (కేంద్ర బృందం) గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను సందర్శించింది. డాక్టర్ వై.రమణ, డాక్టర్ సీహెచ్.పాదాలు నేతృత్వంలో పీహెచ్‌సీకి వచ్చిన బృందం.. ఓపీ రిజిస్టర్, డిస్పెన్సరీ, స్టోర్ రూమ్, ల్యాబ్‌లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానం, డెలివరీ రూమ్‌తోపాటు ఇన్‌పేషెంట్ విభాగంలో ఫీమేల్, మేల్ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మందులను నిల్వ ఉంచిన గదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మందులను ఎప్పటికప్పుడు సరి చూసుకోవడంతోపాటు ఇండెంట్ చేసుకోవాలని సూచించారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ రికార్డులను పరిశీలించారు. బడ్జెట్, బడ్జెట్ రిలీజ్, ఖర్చుల స్టేట్‌మెంట్‌లను పరిశీలించారు. డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయానికి చెందిన అధికారులు శశిభూషణ్, మురళీకృష్ణ, పీహెచ్‌సీ వైద్యాధికారులు ఎం.సుధాకర్, డాక్టర్ బద్రి నారాయణమూర్తి, సీహెచ్‌వో పి.నాగ అప్పారావు ఇక్కడి కార్యక్రమాలను బృందానికి వివరించారు. ఈ సందర్భంగా వైద్య బృందం పీహెచ్‌సీ ఆవరణలో మొక్కలు నాటారు.
Comments
Please login to add a commentAdd a comment