అక్కిరెడ్డిపాలెం: గాజువాకలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాజువాక ఎస్‌ఐ నజీర్ తెలిపిన వివరాలివీ.. భెల్(హెచ్‌పీవీపీ)లో సబ్ జెట్ కాంట్రాక్ట్ విభాగంలో సిబ్బందికి మధ్యప్రదేశ్‌కు చెందిన చైన్ పాల్‌సింగ్(32) ఆహారం అందజేసే పనులు నిర్వహిస్తున్నాడు. తన మేనేజర్, మరో ముగ్గురితో కలిసి గాజువాకలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నా డు. పాల్‌సింగ్‌కు తన భార్యతో గొడవలు ఉన్నాయని, మధ్యప్రదేశ్‌లోని పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నడు స్తోందని సహోద్యోగులు తెలిపారు. కాగా.. శనివారం మధ్యాహ్న సమయంలో చైన్ పాల్‌సింగ్‌కు ఆహారం ఇవ్వడానికి డ్రైవర్ శ్రీధర్ ఫ్లాట్‌కు వెళ్లాడు. ఫ్లాట్ తలుపులు కొట్టి పాల్‌సింగ్‌ను పిలవగా, ఎంతకీ తలుపులు తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి తలుపును తోసి లోపల చూశాడు. పాల్‌సింగ్ లుంగీతో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో వెంటనే సహోద్యోగులకు విషయం తెలిపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. డ్రైవర్ శ్రీధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment