
‘సంకల్ప’లో క్రీడా వేడుక
సింథియా : తూర్పు నావికాదళ పరిధిలోని ప్రత్యేక విద్య, సలహా కేంద్రం విశాఖపట్నంలోని సంకల్ప వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి లాబోనీ సక్సేనా, వైస్ ప్రెసిడెంట్ ఎన్‌డబ్ల్యూడబ్ల్యూఏ (ఈఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శక్తివంతమైన ఎనర్జిటిక్ ఏరోబిక్ డిస్‌ప్లేలు, రిలే రేసులు, ఆటలు పలువుర్ని ఆకర్షించాయి. ఈ విధంగా విద్యార్థుల సామర్థ్యాలను ప్రదర్శించే విధంగా శిక్షణ ఇచ్చిన సిబ్బందిని, విద్యార్థుల తల్లిదండ్రులను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment