తీరంలో చేపల కలకలం
భీమునిపట్నం: చనిపోయిన చేపలు ఒడ్డుకు కొట్టుకు రావడం కలకలం రేపింది. రెండు రోజులుగా గోస్తని నది తీరానికి పెద్ద ఎత్తున చేపలు కొట్టుకొస్తున్నాయి. నీటి కాలుష్యం కారణంగా ఇవి చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్నాయని చాలా మంది భావించారు. అయితే అందులో నిజం లేదని మత్స్యకారులు తెలి పారు. రోజూ మత్స్యకారులు పడవలు, తెప్పల ద్వా రా గోస్తని నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి.. తిరిగి అదే మార్గంలో తీరానికి చేరుకుంటారు. కొద్ది రోజులుగా కారలు అనే చేపలు పెద్ద ఎత్తున వలలకు పడుతున్నాయి. అయితే వీటికి డిమాండ్ లేకపోవడంతో వాటిని మధ్యలోనే నీటిలో పడేస్తున్నారు. అవే తీరానికి కొట్టుకొస్తున్నాయని మత్స్యకార సంఘ నాయకుడు అల్లిపిల్లి నర్శింగరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment