టీడీపీ నాయకులకు జనసేన తీర్థం
కంచరపాలెం: జీవీఎంసీ 56వ వార్డులోని గవర కంచరపాలెం ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు పెంటకోట శివకుమార్ నేతృత్వంలో 450 మంది కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన కార్యాలయంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదివారం వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు టీడీపీ కార్పొరేటర్, జీవీఎంసీ స్డాండింగ్ కమిటీ సభ్యుడు శరగడం రాజశేఖర్‌పై అసంతృప్తితో వీరంతా జనసేనలో చేరినట్లు చెబుతున్నారు. ఆయన నాలుగేళ్ల పాలనలో వార్డు అభివృద్ధి చెందనలేదని, నాయకులు, కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment