మధురవాడ: విశాఖ రూరల్ మండల పరిధిలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రభుత్వ, ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ అభియోగాలపై 7 గురు అధికారులకు జేసీ నోటీసులిచ్చి, ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు చెప్పారు. తాము పదేళ్లుగా వినతిపత్రాలు ఇస్తున్నా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. భూకబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment