హరేకృష్ణ వైకుంఠంలో ఆధ్యాత్మిక శోభ
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద శ్రీ రాధాకృష్ణుల విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సమక్షంలో వివిధ రకాల పండ్లను రాధాకృష్ణుల విగ్రహాలపై ఉంచి ఫలాధివాసం, పట్టు వస్త్రాలతో వస్త్రాధివాసం నిర్వహించారు. అనంతరం రకరకాల పుష్పాలను, హారాలను ఉంచి సయ్యనాధివాసం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రాణప్రతిష్ట, ఆరాధన గురించి పద్మ శ్రీ అవార్డు గ్రహీత మధు పండితదాస వివరించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆంధ్ర, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, ఇస్కాన్ బెంగళూర్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ కేశవ ప్రభు, ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ చంద్రోదయ మందిరం ఉపాధ్యక్షుడు యధిష్టిర కృష్ణదాస, అహ్మదాబాద్ హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు జగన్ మోహన కృష్ణదాస, విజయవాడ అధ్యక్షుడు వంశీధర దాస, విశాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస ప్రవచించారు. అంబరీష దాస, యధురాజ దాస తదితరులు సహాయ సహకారాలు అందించారు.
హరేకృష్ణ వైకుంఠంలో ఆధ్యాత్మిక శోభ
Comments
Please login to add a commentAdd a comment