చోదకులంతా హెల్మెట్ ధరించాల్సిందే..
గోపాలపట్నం: భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. మద్దిలపాలెం కూడలి వద్ద ఈ ర్యాలీ ని కలెక్టర్ హరేందిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్రవాహనచోదకులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాంతకమన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇన్‌చార్జి డీటీవో ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. మోటారు వాహన తనిఖీ అధికారులు, అసిస్టెంట్ మోటార్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment