ఢమాల్
కోడి
భారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు ● చేపలు, మటన్‌కు డిమాండ్
సాధారణ రోజుల్లోఉత్తరాంధ్రలో
కోళ్ల అమ్మకాలు
40 లక్షలు
ఆదివారం జరిగిన
అమ్మకాలు
20 లక్షలు
ఫిషింగ్ హార్బర్‌లో...
అల్లిపురం: రాష్ట్రవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవ్వరు చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆదివారం మటన్, చేపల విక్రయాలు భారీగా జరిగాయి. ఫిషింగ్ హార్బర్‌కు, ఆర్టీసీ కాంప్లెక్స్ దరి సండే ఫిష్ మార్కట్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, రామకృష్ణ జంక్షన్, నెహ్రుబజార్, పెదవాల్తేరు బజారు తదితర ప్రాంతాలలో చేపల మార్కెట్లకు జనాలు పోటెత్తారు. దీంతో చేపల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
ఒక్కసారిగా పడిపోయిన కోళ్ల అమ్మకాలు..
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ వ్యాపారం ఎక్కువుగా జరుగుతోంది. అక్కడ వైరస్ సోకిందనే విషయం బయటకి రాగానే చికెన్, కోడిగుడ్లు తినడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒకప్పుడు కేజీ చికెన్ రూ.400 అయినా ఎగబడి మరి కొనుక్కునేవారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేజీ రూ.150 అమ్మినా కొనడానికి మందుకు రావట్లేదు. దీంతో వ్యాపారులు తలలు బాదుకుంటున్నారు. బ్యాగ్ అధ్యక్షుడు కొట్యాడ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఫారం నుంచి బ్రాయిలర్ కోళ్లు 2లక్షల టన్నులు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు. రిటైల్ దుఖాణ దారులు మాత్రం అమ్మకాలు యాభై శాతం పడిపోయాయని వాపోతు న్నారు. కేజీ చికెన్ డ్రస్డ్ రూ.190, స్కిల్ లెస్ రూ.200కి అమ్మకాలు జరిపారు. మామూలు రోజుల్లో రూ.40లక్షలు అమ్మకాలు జరిగితే ప్రస్తుతం రూ.15 నుంచి 20 లక్షలు మేర అమ్మకాలు జరిగాయని బ్యాగ్ ప్రతినిధులు తెలిపారు.
వైరస్‌ఫారం కోళ్లకు మాత్రమే..
బర్డ్ ఫ్లూ వైరస్ కేవలం ఫారం కోళ్లకు మాత్రమే వ్యాపించింది. బ్రాయిలర్ కోళ్లకు ఎటువంటి వైరస్ లేదు. మాంసం కోసం ఎక్కువుగా బ్రాయిలర్ కోడి మాంసం మాత్రమే వినియోగిస్తారు. చికెన్ బాగా వేడిపై ఉడికించి తింటే ప్రమాదం ఉండదు. బ్రాయిలర్ చికిన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు.
–కొట్యాడ శ్రీనివాసరావు, బ్యాగ్ ప్రెసిడెంట్
ఢమాల్
ఢమాల్
Comments
Please login to add a commentAdd a comment