పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని టొరెంటో పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికులు పి.రామకృష్ణ, జె.బసవేశ్వరరావులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు అందించిన వివరాలు. పరిశ్రమలో నిద్ర మాత్రల తయారీకి ఉపయోగించే జోల్పిడమ్ పౌడర్‌ను ప్యాకింగ్ చేస్తుండగా, ఆ పౌడర్‌ను పీల్చడంతో స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న యాజమాన్యం ఇరువురిని విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొలుకుంటున్నారని సీఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
నిద్ర మాత్రల పౌడర్ ప్యాకింగ్‌లో ఘటన
Comments
Please login to add a commentAdd a comment