మహారాణిపేట: రైతులు పండించిన కూరగాయల పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోతే వాటిని రైతు బజార్లలో విక్రయించేందుకు తమను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. గ్రామాల్లో తగినంత ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయాలను రైతు బజార్లలో అమ్ముకునేలా సహకారం అందిస్తామన్నారు. రైతులు స్థానిక ఉద్యానవన శాఖ అధికారులను/వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలను 9959592474 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment