● మరమ్మతుల పేరుతో పర్యాటక శాఖ అధికారుల కక్కుర్తి ● రుషి
పరిశుభ్రంగా, సర్వాంగ సుందరంగా ఉండే బీచ్‌లకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్‌ను రాష్ట్రంలో దక్కించుకున్న మొట్టమొదటి బీచ్ రుషికొండ. బ్లూఫ్లాగ్ బీచ్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత.. ప్రతిఏటా రెన్యువల్ చేసుకుంటేనే సర్టిఫికేషన్ కొనసాగుతుంది. రెన్యువల్ సర్టిఫికెట్ రావాలంటే 500 మీటర్ల మేర నిత్యం పరిశుభ్రంగా ఉండాలి, పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇదే తమ పాలిట కల్పతరువుగా భావిస్తున్నారు ఏపీటీడీసీ అధికారులు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే రానీ.. పోతే పోనీ.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీటీడీసీలో ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి.. తను చెప్పిందే వేదం అన్నట్లుగా పనుల్లో తన మాయోపాయాలు చూపించారు. ఇటీవల రూ.15 లక్షలతో బ్లూఫ్లాగ్ సాగరతీరంలో వివిధ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయ్యాయని చెప్పారు. కానీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా బీచ్ అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. ఏదో ఒకటి రెండు లక్షలతో పనులు కానిచ్చేసి.. సదరు అధికారి తన బలగంతో కలిసి నిధులు బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తోందని కొందరు ఉద్యోగులు ఆరాతీస్తే.. సదరు ఇంజినీరింగ్ విభాగ అధికారులు మాయం చేసేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ పేరుతో పనులకు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టరుతో మిలాఖత్ అయి.. డబ్బులు వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీటీడీసీ కార్యాలయంలో స్కెచ్‌లు
ఏయే పనులకు ఎంత మేర వాటాలు తీసుకోవాలి.. ఎవరికి కాంట్రాక్టు ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలనే విషయాలన్నీ వీఎంఆర్‌డీఏ ఉద్యోగభవన్‌లో ఉన్న ఏపీటీడీసీ రీజనల్ కార్యాలయంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీచ్ నిర్వహణ ఎలా ఉన్నా కాంట్రాక్టర్‌ను ప్రశ్నించకుండానే.. బిల్లులు మంజూరు చేసేస్తున్నారు. ఏపీటీడీసీ హయాంలో ఉన్న సమయంలో 50 మంది వరకూ బీచ్ మెయింటెనెన్స్ చేపట్టేవారు. కాంట్రాక్టు సంస్థకు బాధ్యతలు అప్పగించిన తర్వాత నెలకు రూ.12 లక్షలు చెల్లిస్తున్నా.. కేవలం రూ.2 లక్షల పనులు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన మొత్తం.. అధికారులు గుటకాయస్వాహా చేసేస్తున్నారు.
● మరమ్మతుల పేరుతో పర్యాటక శాఖ అధికారుల కక్కుర్తి ● రుషి
● మరమ్మతుల పేరుతో పర్యాటక శాఖ అధికారుల కక్కుర్తి ● రుషి
Comments
Please login to add a commentAdd a comment