ప్రతి రోజూ బ్లూఫ్లాగ్‌లోనే తిష్ట
బ్లూఫ్లాగ్ పరిశీలించే బాధ్యత జిల్లా పర్యాటక అధికారులకు అప్పగించారు. నోడల్ అధికారిగా సదరు అధికారే వ్యవహరించాలి. కానీ ఏపీటీడీసీలోని ఓ ఇన్‌చార్జ్ అధికారి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజూ బీచ్‌కు వెళ్లి సాయంత్రం వరకూ అక్కడే తిష్టవేసేస్తున్నారు. కారణమేంటని ఆరాతీస్తే.. పనులు, నిర్వహణ పేరుతో ప్రతి నెలా రూ.10 లక్షల వరకూ మాయం చేసేస్తున్న అక్రమాలు బయటకు రాకుండా మేనేజ్ చేసుకోడానికని తెలుస్తోంది. ఈ అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు స్థానిక సిబ్బందిపై చర్యలు, పనులు చెయ్యడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ కొందరు టూరిజం సిబ్బంది మాత్రం.. ఇన్‌చార్జి ఆగడాలని ఆధారాలతో సహా ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీచ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వకుండా కక్ష కట్టారు. ఫలితంగా వారంతా రోడ్డెక్కారు. మొత్తంగా తన సొంత ఖజానా నింపేసుకోడానికి రుషికొండ బీచ్‌ని బ్లూఫ్లాగ్‌తో కాకుండా అవినీతి కెరటాలతో నింపేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లూఫ్లాగ్‌కు సంబంధించి.. మొత్తం వివరాలు సేకరించాలని టూరిజం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
వాచ్‌టవర్ దుస్థితి
Comments
Please login to add a commentAdd a comment