ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఫిబ్రవరి 18న ఇచ్చే జవహర్‌లాల్ నెహ్రూ(జేఎన్) అవార్డుల ప్రదానం వాయిదా పడినట్టు తెలుస్తోంది. స్టీల్‌ప్లాంట్ కోసం అంకితభావంతో కృషి చేసే అధికారులు, కార్మికులకు ఏటా ఫిబ్రవరి 18న ఉక్కు అవిర్భావ దినోత్సవం సందర్భంగా అవార్డులిస్తారు. ఆ రోజు ఉద్యోగుల కుటుంబీకులు, ఉన్నతాధికారుల సమక్షంలో సీఎండీ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఆనవాయితీ. ఉక్కు అధికారులు, కార్మికులకు చెందిన గత మూడేళ్ల వార్షిక ప్రావీణ్యత రేటింగ్(ఏసీఆర్), అటెండెన్స్ తదితర ప్రమాణాలను బట్టి ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 2023–24కు చెందిన అధికారుల ఏసీఆర్ సిద్ధం కాకపోవడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment