తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం పంచాయతీకి చెందిన కె.సూర్యనారాయణ(45) అనే లారీ డ్రైవర్ ఆదివారం హైదరాబాద్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇటీవల సూర్యనారాయణ హైదరాబాద్ వెళ్లాడు. తనకు పరిచయం ఉన్న వరలక్ష్మి అనే వివాహిత ఇంటికి శనివారం వెళ్లి ఆమె భర్త దుర్గాప్రసాద్‌తో కలిసి మద్యం సేవించాడు. తర్వాత ఇద్దరి మధ్య వివాదం కారణంగా సూర్యనారాయణను దుర్గాప్రసాద్ గాయపరిచి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆదివారం ఉదయం దుర్గాప్రసాద్ ఇంటి ముందు సూర్యనారాయణ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు, పోలీసులు కలిసి సూర్య నారాయణను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్యనారాయణ మృతదేహాన్ని మంగళవారం శిర్లపాలెం తీసుకొస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment