బ్యూటీ బార్ ముసుగులో వ్యభిచారం
● నలుగురు అరెస్టు
కూర్మన్నపాలెం: అందం మెరుగుదిద్దే ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న బ్యూటీ బార్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విటుడు, మహిళ, బార్ నిర్వాహకుడు, ఆయన సహాయకుడిని అరెస్టు చేసినట్లు దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరావు తెలిపారు. కూర్మన్నపాలెం ప్రధాన రహదారిపై ఎస్‌ఎస్ బ్యూటీ బార్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పట్టుబడిన నలుగురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఈ కేసు విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు సేకరించి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల అందజేత
Comments
Please login to add a commentAdd a comment