● రూ.5 వేలు అప్పుచేసిన శంకరావు ● డబ్బులు చెల్లించాలని వడ్డీ వ్యాపారుల వేధింపులు
మధురవాడ: మారికవలస రాజీవ్ గృహకల్పలో విషాదం చోటుచేసుకుంది. కాల్ మనీ వ్యాపారుల ఒత్తిళ్లు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ గృహకల్పలో ఉంటున్న దాసరి శంకరరావు (40)కు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతడు గతంలో సొంత అవసరాల నిమిత్తం వడ్డీ వ్యాపారుల వద్ద రూ.5 వేలు ఫైనాన్స్ తీసుకున్నాడు. వారం రోజుల నుంచి ఫైనాన్స్ కట్టకపోవడంతో వడ్డీ వ్యాపారులు.. శంకరరావు ఇంటికి వచ్చి దుర్భాషలాడారు. వెంటనే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. మనస్తాపం చెందిన శంకరరావు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని భార్య పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment