● కొత్త మీటర్‌ కావాలంటే విద్యుత్‌ అధికారుల చేయి తడపాల్సిందే.. ● కూటమి నేతలతో కలిసి బరితెగిస్తున్న ఈపీడీసీఎల్‌ సిబ్బంది ● కొత్త కనెక్షన్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు ● అపార్ట్‌మెంట్‌ కనెక్షన్‌కు రూ.50 వేలు, వ్యక్తిగత కనెక్షన్‌కు రూ.5 వేలు వసూలు | - | Sakshi
Sakshi News home page

● కొత్త మీటర్‌ కావాలంటే విద్యుత్‌ అధికారుల చేయి తడపాల్సిందే.. ● కూటమి నేతలతో కలిసి బరితెగిస్తున్న ఈపీడీసీఎల్‌ సిబ్బంది ● కొత్త కనెక్షన్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు ● అపార్ట్‌మెంట్‌ కనెక్షన్‌కు రూ.50 వేలు, వ్యక్తిగత కనెక్షన్‌కు రూ.5 వేలు వసూలు

Published Tue, Feb 18 2025 1:34 AM | Last Updated on Tue, Feb 18 2025 1:33 AM

● కొత్త మీటర్‌ కావాలంటే విద్యుత్‌ అధికారుల చేయి తడపాల్స

● కొత్త మీటర్‌ కావాలంటే విద్యుత్‌ అధికారుల చేయి తడపాల్స

సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్రస్తుతం 18,42,691 మంది ఎల్‌టీ కేటగిరీ వినియోగదారులు, 1858 హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులున్నారు. గత ఐదేళ్ల కాలంలో కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే సులువుగా దొరికేది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. స్థానిక ఏఈ కార్యాలయంలో సంప్రదించినా.. కేటగిరీల వారీగా ఫీజులు చెల్లించేవారు. నిర్ణీత గడువులో కొత్త కనెక్షన్‌ మంజూరయ్యేది. 2022 నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు 80 వేల కొత్త కనెక్షన్లు పెరిగాయి. కానీ.. ఎక్కడా లంచాలకు తావులేకుండా మంజూరు చేసేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ అధికారులు కమర్షియల్‌గా మారిపోయారు. కనెక్షన్‌ కావాలంటే చేయి తడపాల్సిందేనని భీష్మించుకు కూర్చుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక లైన్‌మెన్‌లు, ఏఈలు దరఖాస్తులను ప్రాసెసింగ్‌ చేస్తున్నా.. వాటిని ఆపాలంటూ కూటమి నేతలు హుకుం జారీ చేస్తున్నారని తెలుస్తోంది. తమ ఆదేశాలు వచ్చేంత వరకూ కొత్త దరఖాస్తుల జోలికి వెళ్లొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అందుకే విశాఖ సర్కిల్‌ పరిధిలో వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

కూటమి నేతలతో కుమ్మక్కు!

విద్యుత్‌ కనెక్షన్లు ఏమైనా కొత్తవి మంజూరు చేయాలంటే కచ్చితంగా తమను సంప్రదించేలా చూడాలంటూ కూటమి నేతలు విశాఖపట్నం సర్కిల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏ దరఖాస్తు వచ్చినా దానిపై దృష్టి సారించడం లేదు. దరఖాస్తుదారులు వచ్చి తమ కొత్త కనెక్షన్‌ గురించి అడిగితే... కూటమి నేతలతో కుమ్మకై ్క అందినకాడికి దోచుకుంటూ పంచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత కనెక్షన్‌కు కేటగిరీ బట్టి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు.. అపార్ట్‌మెంట్స్‌, విల్లాలు, గ్రూప్‌హౌస్‌లకు విస్తీర్ణం, ఫ్లాట్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష కుపైగా రేటు ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్‌ కచ్చితంగా అవసరం కాబట్టి.. ఎంత డిమాండ్‌ చేస్తే అంత చెల్లింపులు చేసి కనెక్షన్‌ తీసుకుంటున్నామని వినియోగదారులు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement