పోలీస్ స్టేషన్‌కు చేరిన ‘ఆయుష్’ పంచాయితీ
పీఎం పాలెం: ఆయుష్ మధురవాడ జోన్ ప్రాంతీయ కార్యాలయ ఉప సంచాలకురాలు(ఆర్‌డీడీ) ఝాన్సీ లక్ష్మీబాయి, అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దళిత వర్గానికి చెందిన జె.సుష్మ పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. గత ఏడాది నవంబర్‌లో మధురవాడ జోన్ ఆయుష్ ఆర్‌డీడీగా ఝాన్సీ లక్ష్మీబాయి బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా సిబ్బందితో ఆమెకు పొసగట్లేదు. ఉన్నతాధికారిగా తనకు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదన్న అక్కసుతో దిగువ సిబ్బందిపై రుసరుస లాడుతున్నారని, జూనియర్ అసిస్టెంట్ సుష్మను వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లంచ్ సమయంలో అనీజీగా ఉందని, భోజనం చేసేందుకు ఆర్‌డీడీ గదిలోకి వెళ్లగా, తనపై లక్ష్మీబాయి చేయి చేసుకుని, విపరీతంగా దూషించినట్లు సుష్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పై అధికారినన్న కనీస జ్ఞానం లేకుండా తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడిచేసి తన దుస్తులు చింపివేసినట్లు ఆరోపిస్తూ ఆర్‌డీడీ ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
ఆయుష్ ఆర్‌డీడీ, జూనియర్ అసిస్టెంట్ పరస్పర ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment