కుడో బెల్ట్ గ్రౌండింగ్ టెస్ట్‌కు 40 మంది హాజరు
పరవాడ: ఆంధ్రప్రదేశ్ కుడో అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ త్రిష క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన కుడో బెల్ట్ గ్రౌండింగ్ టెస్ట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 40 మంది విద్యార్థులు పాల్గొన్నారని అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శశిధర్ తెలిపారు. కుడో బెల్ట్ గ్రౌండింగ్ టెస్ట్‌కు రావాడ శివారు రేకవానిపాలెం గ్రామానికి చెందిన మొల్లి తులసీరావు ఎగ్జామినర్‌గా ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ నెల 26, 27న కుడో కప్‌ను పరవాడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 16న పూనేలో నిర్వహించనున్న 31వ జాతీయ స్థాయి కుడో కప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎ.కిశోర్, అనకాపల్లి జిల్లా కుడో అసోసియేషన్ కార్యదర్శి పి.రమణ, కోచ్ బి.యశ్వంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment