మహిళా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాభాయ్ దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం వైస్ చాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక, మేధో అంశాలలో పోటీలను నిర్వహిస్తున్నామని కేంద్రం సంచాలకులు ఆచార్య ఎ. పల్లవి వివరించారు. మార్చి 6,7 తేదీల్లో ఈ కార్యక్రమాలు ఉంనిర్వహిస్తామని ఆమె వీసీకి వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఈఎన్ ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment