ఐఐఎంవీలో నూరుశాతం ప్లేస్‌మెంట్స్
తగరపువలస: ఐఐఎంవీ 2024–2026 బ్యాచ్ నూరుశాతం నియామకాలతో వేసవిని విజయవంతంగా ముగించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ వేసవి ప్లేస్‌మెంట్ ప్రక్రియలో 344 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. 130 మంది రిక్రూటర్లు నియామక జాబితాలో చేరారన్నారు. వీరిలో 77 మంది కొత్తగా తమతో భాగస్వామ్యం పొందారన్నారు. కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ చైర్‌పర్సన్ దీపికా గుప్తా మాట్లాడుతూ అంచనాలు అధిగమించి నూరు శాతం ఫలితాలు సాధించామన్నారు. గతేడాదితో పోలిస్తే స్టైఫండ్‌లో 45.83 శాతం గ్రోత్ ఉందన్నారు.
రుషికొండ బీచ్‌లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కొమ్మాది : రుషికొండ బీచ్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి గురువారం పరిశీలించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టూరిజం అధికారులకు సూచించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీ జగదీష్, ఏఎంఓహెచ్ కిశోర్ తదితరులు ఉన్నారు.
నేడు జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. నగర మేయర్, స్థాయి సంఘం చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన ఉదయం 11 గంటల నుంచి జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశంలో 104 అంశాలు సభ్యుల ముందుకు చర్చకు రానున్నాయి. పలు అభివృద్ధి అంశాలతో పాటు ఉద్యోగుల సర్వీస్ అంశాలు చర్చకు రానున్నాయి.
ఐఐఎంవీలో నూరుశాతం ప్లేస్‌మెంట్స్
Comments
Please login to add a commentAdd a comment