8న అప్పన్న వార్షిక కల్యాణోత్సవం
సింహాచలం: అన్ని శాఖల సమన్వయంతో వచ్చే నెల 8న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు తెలిపారు. వార్షిక కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సింహగిరిపై గురువారం పోలీస్, వైద్యారోగ్య, ఈపీడీసీఎల్, ఆర్టీసీ, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వచ్చే నెల 8న రాత్రి 8 గంటల నుంచి స్వామి రథోత్సవం, 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య శిబిరాల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవ్, సీఐ గొలగాని అప్పారావు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment