
ప్రియాంక విద్యోదయ విజయదుందుభి
అల్లిపురం: 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అల్లిపురంలోని ప్రియాంక విద్యోదయ హైస్కూల్ విజయదుందుభి మోగించింది. పాఠశాలకు చెందిన సాయి యామిని 595 మార్కు లు సాధించి జిల్లా స్థాయి ర్యాంక్ సాధించింది. ఈగల దుర్గా భవానీ జ్యోతిక 592, కలే దయానంద్ 590, దండు కావ్య 590 మార్కులు సాధించి అద్బుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 190 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఉపాధ్యాయుల క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్ధుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ విజయానికి కారణమని పాఠశాల హెచ్‌ఎం డాక్టర్ భగీరథ్ కుమార్ దధీచి అన్నారు. విద్యార్థులను అభినందించారు.