
1985 నుంచి స్నేహితులం
నిత్యం నాకు ఫోన్‌లో గుడ్‌మార్నింగ్ చెప్పేవారు. 1985 నుంచి ఆయనతో నాకు స్నేహం ఉంది. అక్కయ్యపాలెంలోని అతని ఇంటి దగ్గరలోనే మా ఇల్లు ఉంది. మంగళవారం ఉదయం కూడా నాకు మెసేజ్ పంపారు. బుధవారం నేను మెసేజ్ చేసినా.. ఆయన నుంచి సమాధానం రాలేదు. చంద్రమౌళి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. అరకు వంటి ప్రాంతాల్లో దుప్పట్లు పంచడం, వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఉగ్రవాదులు చంపడం కలచివేస్తోంది. మనసుకు చాలా బాధగా ఉంది.
–శ్యాంప్రసాద్, స్నేహితుడు