
శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
విజయనగరం ఫోర్ట్: శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె శనివారం కె.ఎల్.పురంలో ఉన్న శిశుగృహను తనిఖీచేశారు. ఇద్దరి శిశువుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒక శిశువుకు సహస్ర అని నామకరణం చేశారు. పిల్లల వ్యక్తిగత రికార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆ తర్వాత బాలసదన్‌ను పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్పాన్, సెమి అర్పాన్ పిల్లలను తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. వంటగది, పిల్లల మంచాలు పరిశీలించి స్వచ్ఛత, శుభ్రత మరింత పాటించాలని సూచించారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీడీపీఓ, డీసీపీయూ, చైల్డ్‌లైన్, ఎంఈఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేనెల 17 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 10 తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రుక్సానా బేగం, సీడీపీఓలు ప్రసన్న, ఉమాభారతి, ఆరుద్ర, డీఈఓ మాణిక్యంనాయుడు, ఏపీసీ డాక్టర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment