ఉద్యోగులను కొనసాగించండి
విజయనగరం ఫోర్ట్: సంచార పశు ఆరోగ్య సేవా వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ వై.వి.రమణకు మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ పరిధిలో ఉన్న సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈఎంఆర్‌ఐ ఏజెన్సీ పరిధిలో మూడేళ్లుగా పనిచేస్తున్నారన్నారు. ఈ నెల 15తో సంస్థ కాలపరిమితి ముగిసిందని, ఉద్యోగాల నుంచి తొలగించినట్టు లేఖలు పంపడం ప్రభుత్వానికి తగదన్నారు. ఏజేన్సీలు మారినా, ప్రభుత్వం అప్పటి వరకు పనిచేసిన ఉద్యోగులను నూతన సర్వీస్ ప్రొవైడర్లతో కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కనీస వేతనాలతో కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్.నరేష్, సాయిసతీష్, సురేష్, జయలక్ష్మి, భద్రకాళి, యోగింధర్ దొర, నీరజ, కావ్య, యశ్వంత్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
జేసీ, పశు సంవర్థక శాఖ జేడీకి వినతిపత్రం అందజేసిన పశు సంచార వాహన ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment