–8లో
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
పెట్రోల్ బంకులో చిరిగిన పది రూపాయల నోటు గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదికొచ్చింది. వినియోగదారుడు కాలు విరిగి
ఆస్పత్రి పాలయ్యాడు.
దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు
దివ్యాంగులకు రైల్వే పాస్‌లను ఆన్‌లైన్‌లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
20న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
పాలకొండకు రాక
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు రానున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పాలకొండకు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) మంగళవారం వెల్లడించారు. 20వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ 1.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి 2.15 గంటలకు పాలకొండలోని పాలవలస రాజశేఖరం తనయుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. దాదాపు గంట పాటు అక్కడ ఉండనున్నారు. తదుపరి సాయంత్రం 3.30 గంటలకు పాలకొండ నుంచి తిరిగి బయలుదేరుతారు. 4.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment