సదస్సు పేరుతో ప్రచారం
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రవివర్మకి మద్దతుగా టీడీపీ చీకటి ప్రచారానికి తెరతీసింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యాసదస్సు పేరుతో విందు భోజనాలు పెట్టడం, ఎన్నికల ప్రచారం జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుల పేరులేకుండా ‘విద్యారంగం–వర్తమాన సవాళ్లు’ అనే అంశంతో పేరుతో మెసానిక్ టెంపుల్ సమావేశ మందిరంలో మంగళవారం విద్యాసదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులను మాత్రమే ఆ సదస్సుకు
ఆహ్వానం పలుకుతూ టీచర్లను వాట్సప్ గ్రూపుల్లో ఆహ్వానించారు. తీరా అక్కడి వెళ్తే అది ఎన్నికల ప్రచార వేదికగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఉపన్యాసాలు సాగాయి. అనంతరం సదస్సుకు వచ్చిన వారికి విందు పెట్టారు. సదస్సుకు వచ్చిన వారికి ఎమ్మెల్సీ బరిలో ఉన్న పాకలపాటి రవివర్మ ఆహ్వానం పలకడం గమనార్హం. విద్యాసదస్సు పేరుచెప్పి ఇదెక్కడి ఎన్నికల ప్రచారమంటూ పలువురు గురువులు బహిరంగంగానే విమర్శించడం గమనార్హం.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
సదస్సు పేరుతో ప్రచారం
సదస్సు పేరుతో ప్రచారం
సదస్సు పేరుతో ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment