గాదె గెలుపే లక్ష్యం: ఎస్టీయూ
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులునాయుడు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ముఖ్యనాయకులు తెలిపారు. స్థానిక పీఆర్‌టీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టీయూ నాయకులు దాడిచిలుక శ్యామ్, వసంతుల గోవిందరావు తదితరులు మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్టీయూ రాష్ట్ర కమిటీ ఏ ఒక్క అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్థానిక పరిస్థితులు, ఉపాధ్యాయ వర్గాల శ్రేయస్సు దృష్ట్యా గాదె శ్రీనివాసులునాయుడి ప్రాతినిథ్యం ఉండాలని కోరుకుంటున్నామని ప్రకటించారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్టీయూ నాయకులు గాదె గెలుపునకు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శ్రీనివాస్‌దొర, లచ్చన్న, సత్యనారాయణ, మహేష్, శ్రీనివాస్, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్‌నాయుడు, ఎస్.త్రినాథ్, రెడ్డి గణపతి, రాజారావు, బి.అప్పారావు, ఆనంద్, జాకబ్, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment