
కుటీర పరిశ్రమల ఏర్పాటుకు చేయూత
లక్కవరపుకోట: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (ఏపీఎఫ్‌పీఎస్)లో భాగంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసే రైతులకు ఆర్థిక చేయూతనిస్తున్నట్టు ఆ సంస్థ జనరల్ మేనేజర్ సాయిశ్రీనివాస్ తెలిపారు. మండలంలోని భీమాళి గ్రామంలో మామిడి తాండ్ర తయారీదారులకు శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటీర పరిశ్రమలో తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఉద్యానవనశాఖ అధికారి ఎ.వి.జమదగ్ని మాట్లాడుతూ కుటీర పరిశ్రమ ఏర్పాటుకు రైతు వాటాగా 10 శాతం చెల్లిస్తే 90 శాతం బ్యాంక్ రుణం రూపంలో ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇందులో 35 శాతం రాయితీ వర్తిస్తుందని చెప్పారు. ఉద్యానవన శాఖ పరిధిలో ఏర్పాటుకు అవకాశమున్న పరిశ్రమలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఓ పప్పుపద్మ, డీఆర్‌పీ కె.శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎఫ్‌పీఎస్ జనరల్ మేనేజర్
సాయిశ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment