
బస్సులో తీసుకురాలేకపోతున్నాం...
మా మామయ్య తవిటియ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. గతంలో 108 వాహనం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలకొండ వచ్చి డయాలసిస్ చేయించి తీసుకువెళ్లేవాళ్లం. ఇప్పుడు 108 సేవలను ప్రభుత్వం నిలిపేసింది. కాయకష్టం చేసుకొని బతికేవాళ్లం. ఆ కొంత సంపాదన, పింఛన్ మొత్తం రాకపోకలకే సరిపోతున్నాయి. బస్సుల్లో తీసుకు రాలేకపోతున్నాం.
– బి. యశోద, మారేడుబాక, రాజాం మండలం
ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి
కిడ్నీ సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్నాను. రెక్కాడితేగాని డొక్కాడని గిరిజన కుటుంబం మాది. భార్య తవిటమ్మ సాయంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి నెలలో ఐదు సార్లు వచ్చి వెళ్తున్నాను. 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ప్రాణాలు పోయేట్లు ఉన్నాయి. ఒకసారి రాకపోకలకు రూ.800 వరకు ఖర్చు అవుతుంది. 108 సేవలు నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– ఎస్.అప్పన్న, కర్లెమ్మ పరిధి, కొత్తూరు మండలం

బస్సులో తీసుకురాలేకపోతున్నాం...
Comments
Please login to add a commentAdd a comment