మాతాశిశు మరణాల నివారణకు చర్యలు
విజయనగరం ఫోర్ట్: మాతాశిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బొండపల్లి, దేవుపల్లి, వెలగాడ, సతివాడ, జామి, గంట్యాడ, పీఎం పాలేం, కొట్టాం, పోలిపల్లి, జరజాపుపేట యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు. హైరిస్క్ గర్భిణులను త్వరితగతిన గుర్తించి సుఖప్రసవమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు శతశాతం వేయాలన్నారు. 100 రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వైద్య సేవల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్‌సీడీ పీఓ డాక్టర్ సుబ్రమణ్యం, డీఎస్‌ఓ డాక్టర్ సత్యనారాయణ, డెమో వి. చిన్నతల్లి, డీఎంఓ వై.మణి, ఎస్‌ఓ ధర్మారావు, డీపీహెచ్‌ఎన్‌ఓ మామిడి సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment