విజయనగరం లీగల్: జాతీయ న్యాయసేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో జిల్లా సబ్‌జైల్‌ను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్‌కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు వివక్ష చూపించరాదన్నారు. అనంతరం జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను, ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. మెనూపై ఆరా తీశారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి ఉచిత న్యాయసేవ అందించడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment