గ్రూప్–2 అభ్యర్థులపై దుశ్చర్య
విజయనగరం క్రైమ్: రోస్టర్ విధానంలో స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరుద్యోగ అభ్యర్థులను చెదరగొట్టి ఆందోళనను విరమింపజేశారు. ఈ దృశ్యాలను చూసిన నిరుద్యోగ అభ్యర్థులు పోలీసులు, కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ విజయనగరం కోట కూడలి వద్ద అభ్యర్థులు శనివారం ఉదయం నుంచి ఆందోళన తలపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో అభ్యర్థులంతా సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో విజయనగరం కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అభ్యర్థుల ధర్నాతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్‌టౌన్, టుటౌన్ సీఐలు తమ సిబ్బందితో కోట కూడలి వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించకుంటే క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు వినకపోవడంతో డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బలవంతంగా జీపుల్లో ఎక్కించి కొందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరికొందరిని దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. కోట, బొంకులదిబ్బ, మూడు లాంతర్లు, గురజాడ అప్పారావు రోడ్లలో కనిపించిన అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి రాత్రి సమయాన దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు.
బలవంతంగా జీపులో తరలింపు
గ్రూప్–2 అభ్యర్థులపై దుశ్చర్య
గ్రూప్–2 అభ్యర్థులపై దుశ్చర్య
Comments
Please login to add a commentAdd a comment