కళారంగానికి బ్రహ్మానందం సేవలు అద్వితీయం
● ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు
● జరజాపుపేటలో ముగిసిన తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు
నెల్లిమర్ల రూరల్: కళారంగానికి ఆరిపాక బ్రహ్మానందం చేసిన సేవలు అద్వితీయమని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు కొనియాడారు. మండలంలోని జరజాపుపేట గ్రామంలో ఆరిపాక బ్రహ్మానందం స్మారకార్థం మూడురోజుల పాటు నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో అలనాటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. బ్రహ్మానందం మాష్టారు తన నటనతో జరజాపుపేట పేరును రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారని, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. అనంతరం కళాకారులను ప్రోత్సహిస్తూ విజేతలకు రూ.10వేలు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్సీ ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ చనమళ్లు వెంకటరమణ, నాయకులు తోట తిరుపతి, మద్దిల వాసు, తుమ్ము వెంకటరమణ, నల్లి చంద్రశేఖర్, కనకల హైమావతి, ఎంఈఓ ఈపు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
విజయనగరం ఫోర్ట్: చిరుధాన్యాలతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఇటీవల కాలంలో చిరుధాన్యాల వినియోగం పెరిగిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంచాలకురా లు డాక్టర్ సి.తారాసత్యవతి అన్నారు. గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం నిర్వహించిన చిరుధాన్యాల కిసాన్ మేళాను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికమన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడితే చిరుధాన్యాలను ఉపఉత్పత్తులుగా తయారు చేసుకునే యంత్ర పరికరాలను అందిస్తామన్నారు. కిసాన్ మేళాలో చోడి, కొర్ర, సామ తదితర చిరుధాన్యలతో తయారు చేసిన బిస్కెట్స్, మిక్సర్, మురుకులు, నువ్వు ఉండలు వంటి ఆహార పదార్థాల స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో గిరిజన ఉప ప్రణాళిక ప్రాజెక్టు పరిశీలకుడు కె. శ్రీనివాసబాబు, ప్రాజెక్టు ఇన్‌చార్జి సంగప్ప, అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆదిలక్ష్మి, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ టి.ఎస్.ఎస్.కె.పాత్రో, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు నర్సుపల్లి అనురాధ, త్రివేణి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment