సెకీ విద్యుత్ ఒప్పందంపై.. దుష్ప్రచారం బట్టబయలు
వంగర: సెకీ విద్యుత్ ఒప్పందంపై టీడీపీ, ఎల్లోమీడియా చేసిన దుష్ప్రచారం బట్టబయలైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో నిబంధనలు మేరకు సెకీ విద్యుత్ ఒప్పందం జరిగిందని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పడం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు మచ్చుతునకగా పేర్కొన్నారు. ఇరువాడలో విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. 7వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం చారిత్రాత్మకమని, జగన్‌తోనే నిజమైన సంపద సృష్టి సాధ్యమన్నారు. ఎల్లోమీడియా, టీడీపీలకు ఏఆర్‌ఆర్ తీర్పు చెంపపెట్టువంటిదన్నారు. కూటమి ప్రభుత్వానికి పాలన చేతకాక గత ప్రభుత్వంపై తప్పులునెట్టివేసేందుకు చేస్తోందన్నారు. కారుచౌకుగా విద్యుత్ కొనుగోలు జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే జరిగిందని ప్రజలు నేడు గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజలను మోసగించిన సీఎం చంద్రబాబు... ఎన్ని పథకాలు అమలు చేశారో ప్రజలకు అర్ధ మైందన్నారు. ఆయన వెంట వంగర, వీరఘట్టం మండలాల ఎంపీపీలు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, దమలపాటి వెంకటరమణ, పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, సర్పంచ్‌లు పెద్దిరెడ్డి విజయ, మరిచర్ల విజయలక్ష్మి, బెజ్జిపురం విజయ్‌కుమార్, శనిపతి సత్యారావు, చందక తాతబాబు, పార్టీ నాయకులు బెవర నూకంనాయుడు, బొంతు వెంకటరావు, వేమిరెడ్డి సూర్యనారాయణ ఉన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
Comments
Please login to add a commentAdd a comment