గడ్డి మందు తాగిన వ్యక్తికి అస్వస్థత
పార్వతీపురం టౌన్: గడ్డి మందు తాగిన వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామానికి చెందిన చొంగళ కృష్ణమూర్తి భార్య బంగారమ్మ తెలిపిన వివరాల మేరకు కృష్ణమూర్తి చాలా కాలంగా మెడ, రెండు భుజాల నొప్పితో బాధ పడుతున్నాడు. గత మూడు రోజులుగా నొప్పిని భరించలేక చనిపోవాలని నిర్ణయం తీసుకుని గడ్డి మందు తాగాడు. దీంతో కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అవుట్‌పోస్టు ఏఎస్‌ఐ నిమ్మకాయల భాస్కరరావు వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు.
పుష్పాలంకరణలో శ్రీనివాసుడు
విజయనగరం టౌన్: నగరంలోని టీటీ డీ కళ్యాణ మండపం ఆవరణలో కొలువైన శ్రీనివాసుడు పుష్పాలంకరణలో శ నివారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆ లయ ప్రధాన అర్చకుడు పీవీ.నరసింహాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చన లు నిర్వహించారు. అనంతరం భక్తుల గోత్రనామాలతో పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment