ఇఫ్టూ విలీన సభను విజయవంతం చేయండి
బొబ్బిలి: రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద మార్చి 2వ తేదీన నిర్వహించే ఇఫ్టూ విలీన సభను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ఎం.గోపాలం పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను బొబ్బిలిలో గురువారం ఆవిష్కరించారు. కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వి.రామమూర్తి, పిల్లా లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
యువకుడు
అనుమానాస్పద మృతి
● విజయనగరంలో ఘటన..
చినరావుపల్లిలో విషాదం
ఎచ్చెర్ల క్యాంపస్ : ఆదుకుంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విజయన గరం జిల్లాలో డిగ్రీ చదువుతున్న కుమారుడు మృతి చెందాడన్న వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన అన్నెపు గణేష్, అమ్మాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్ డిగ్రీ పూర్తయి ఉద్యోగ వేటలో ఉండగా, చిన్న కుమారుడు లోకేష్ విజయనగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఒక వైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు రక్షణ రంగంలో ఉద్యోగాల కోసం స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకు తీసుకొని కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటల సమయంలో లోకేష్ స్నేహితులు సంతోష్‌కు ఫోన్ చేసి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో విషాదంలో మునిగిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు విజయనగరం బయలుదేరారు. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి భోరున విలపించాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ విజయనగరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోకేష్ స్నేహితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 నుంచి 3 గంటల మధ్య మృతి జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పంచనామా నిర్వహించిన వైద్యులు సైతం సస్పెక్టెడ్ డెత్ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల తన తరగతికే చెందిన ఓ విద్యార్థిని లోకేష్ ఇష్టపడినట్టుగా సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో మరో యువకుడు కూడా అదే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు స్నేహితుల ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ మృతి మిస్టరీగా మారింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువకుడు పరారీ!
విజయనగరం క్రైమ్: విజయనగరం పట్టణంలోని రెయ్యిల వీధికి చెందిన పాండ్రంకి సాయి (29) కనిపించడం లేదంటూ తల్లి చిట్టెమ్మ విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయికి వచ్చేనెల పెళ్లి చేయాలని పెద్దలు ముహూర్తం పెట్టారు. ఇష్టంలేని పెళ్లి చేయడం వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
12 నెలల్లో 56 మిస్సింగ్ కేసులు
జిల్లా కేంద్రంలో మిస్సింగ్ కేసుల నమోదు ఇటీవల పెరిగింది. గడిచిన 12 నెలల్లో వన్టౌన్ పోలీస్ స్టేషన్‌లో 56 మిస్సింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 22 మంది మహిళలు మిస్సింగ్ కాగా, 21 మందిని పోలీసులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాటలురాని (మూగది) కే.ఎల్.పురానికి చెందిన బి.ముత్యాలమ్మ(59) ఆచూకీ పోలీసులకు ఇప్పటికీ లభించలేదు. పురుషుల్లో 20 మంది అదృశ్యంకాగా 17 మందిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. కె.ఎల్.పురానికి చెందిన జి.కూర్మారావు(52), నాగోజీ పేటకు చెందిన గంటా నారాయణరావు(37), వీటీ ఆగ్రహారం రీమాపేటకు చెందిన గడి అప్పారావు(55) ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరి ఆచూకీని తెలుసుకునేందుకు పోలీస్‌బృందాలు పనిచేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇఫ్టూ విలీన సభను విజయవంతం చేయండి
Comments
Please login to add a commentAdd a comment