పార్వతీపురంటౌన్: విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు అన్నారు. సైన్స్ దినోత్సవ పోస్టర్‌ను డీఈఓ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్‌పట్ల ఆసక్తి పెంచేలా జిల్లాలో శుక్రవారం వివిధ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 3, 4, 5 తరగతుల విద్యర్థులకు ఇస్రో సాధించిన విజయాలపై డ్రాయింగ్ పోటీలు, 8, 9 తరగతుల విద్యార్థులకు వికసిత్ భారత్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశంపైన సెమినార్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. శుక్రవారం పాఠశాల స్థాయి, మార్చి 1న మండల స్థాయి, మార్చి 3న జిల్లా స్థాయి పోటీలు ఉల్లిభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు, ఆప్‌కాస్ట్ జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణ, ఎన్‌జీసీ కో ఆర్డినేటర్ జి.రాజు, తదితరులు పాల్గొన్నారు.
● డీఈఓ తిరుపతినాయుడు
Comments
Please login to add a commentAdd a comment