● ఎల్.కోటలో బర్డ్‌ఫ్లూ!
లక్కవరపుకోట మండలంలో బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తిచెందిందన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. మండలంలోని అరకు–విశాఖపట్నం రోడ్డులో జమ్మాదేవిపేట ఎత్తు బ్రిడ్జి సమీపంలోని రైస్ మిల్లులో పెంచుతున్న రెండు టర్కీ కోళ్లు గురువారం మృతి చెందాయి. బుధవారం రాత్రి వరకు బాగానే ఉన్న కోళ్లు ఉదయానికి మృతి చెందినట్టు మిల్లు యజమాని తెలిపారు. మృతి చెందిన కోళ్లను రోడ్డు పక్కనే పడేయడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ బర్డ్‌ఫ్లూతో చనిపోతే గొయ్యితీసి పూడ్చాలే తప్ప ఇలా పడేయడం వల్ల వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందంటున్నారు. ఇదే విషయంపై ఎల్.కోట మండలం పశుసంవర్థక శాఖ అధికారి కోరాడ గాయత్రి మాట్లాడుతూ ఇంతవరకు బర్డ్‌ఫ్లూ వైరస్ ఎక్కడా నమోదుకాలేదన్నారు. వాతావరణ మార్పులతో ప్రస్తుతం కోళ్లు చనిపోతున్నాయన్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. – లక్కవరపుకోట
Comments
Please login to add a commentAdd a comment