కొత్త ఆవిష్కరణలపైనే భవిత
రాజాం సిటీ: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని, కొత్తకొత్త ఆవిష్కరణలపైనే యువత భవిత ఆధారపడి ఉందని ఏపీ మాజీ ఐటీ సలహాదారు, ఇండియన్ బ్లాక్‌చైన్ స్టాండర్స్ కమిటీ చైర్మన్ జేఏ చౌదరి అన్నారు. రాజాం జీఎంఆర్ ఐటీలో స్టెప్‌కాన్–2025 సదస్సు గురువారం ప్రారంభమైంది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చౌదరి మాట్లాడుతూ భవిష్యత్తులో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవన్నారు. పరిశ్రమల మనుగ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఈ తరుణంలో యువతరం నూతన ఆవిష్కరణలతో ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సరికొత్త సాంకేతిక యుగానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నవయసు నుంచే తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చాలన్నారు. అలాంటివారిని ప్రోత్సహించేందుకు స్టార్టప్ కంపెనీలు, యూనికార్న్‌లు ముందుకు వస్తున్నాయని తెలిపారు. 8 నుంచి 18 ఏళ్ల ప్రతిభావంతులైన గ్రామీణ యువకుల కోసం జూనికార్న్ ఏర్పాటైందని, 19 నుంచి 25 ఏళ్ల యువకులు అనేక రోజువారీ సమస్యలకు పరిష్కారాలు వెతికేందుకు సిద్ధమవుతున్నారన్నారు. 5 నుంచి 6 నెలల పాటు 30 మంది చేసే ప్రాజెక్టును ఐదు నిమిషాల్లో పూర్తిచేసే ఏఐ సాధనాలు మనకు లభ్యమవుతున్నాయని తెలిపారు. దీనిని మరింతగా అభివృద్ధి చేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ తోడైతే రాబోయే రోజుల్లో మరింత డిప్రెషన్స్‌కు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో సమగ్రమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించుకుంటే మనుగడ ఉంటుందని, ఉద్యోగ అవకాశాలు పొందగలరని తెలిపారు. ఏకాగ్రత, దూరదృష్టితో ఏదైనా సాధించవచ్చన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ తరగతిలో కాకుండా బయట అనేక విషయాలు నేర్చుకోవచ్చని, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పనిచేయాలన్నారు. కోర్, ఐటీలను మేళవించి నిత్యజీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలను పొందగలమని తెలిపారు. సదస్సుకు దేశం నలుమూలల నుంచి 3,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా ప్రాజెక్ట్స్, స్టార్టప్ ఐడియా కాంటెస్ట్, పేపర్ ప్రజెంటేషన్, వర్క్‌షాప్స్ తదితర అంశాల్లో ప్రతిభను ప్రదర్శిస్తారన్నారు. కార్యక్రమంలో జీఎఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, సీఈఓ ఎల్‌ఎం లక్ష్మణమూర్తి, స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జి.కౌశిక్, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ జె.శ్రీధర్, కో కన్వీనర్ డాక్టర్ ఎం.సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ మాజీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి
సరికొత్త సాంకేతిక యుగానికి యువత నాందిపలకాలి
జీఎంఆర్ ఐటీలో స్టెప్‌కాన్ సదస్సు
ప్రారంభం
కొత్త ఆవిష్కరణలపైనే భవిత
కొత్త ఆవిష్కరణలపైనే భవిత
Comments
Please login to add a commentAdd a comment